ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి బలోపేతం కావడాన్ని టిడిపి జీర్ణించుకోలేక పోతోందని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు.ఏపీలో బలోపేతం కావడం జాతీయ పార్టీ ఆలోచనలకు అనుగుణంగానే పనిచేస్తున్నామని ఆయన చెప్పారు.తమను ఎదగకుండా టిడిపి ప్రయత్నాలు చేస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు.
అన్నాడీఎంకే పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యేతో సహ 44 మంది నాయకులను ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తప్పించారు. అన్నాడీఎంకే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్న 44 మంది నాయకులను గురువారం బహిష్కరించారు.
మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లాండ్ ఓపెనర్ అలెస్టర్ కుక్ డబుల్ సెంచరీతో మెరిశాడు. టెస్టుల్లో అలెస్టర్ కుక్‌కు ఇది ఐదో డబుల్ సెంచరీ. అలెస్టర్ కుక్ డబుల్ సెంచరీతో మెరవడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది.
రాజ్యాంగం, లౌకికవాదంపై తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో కేంద్రమంత్రి అనంత్‌కుమార్ హెగ్దే గురువారం లోక్‌సభలో క్షమాపణలు చెప్పారు. ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే తనను క్షమించాలని కోరారు.
భారత న్యాయ వ్యవస్థలు 2017 సంవత్సరంలో పలు కీలక కేసుల్లో సంచలన తీర్పులను వెలువరించాయి. ట్రిపుల్ తలాక్, ఆరుషి హత్య కేసు, వ్యక్తిగత సమాచార గోప్యత హక్కు లాంటి కేసుల్లో కోర్టులు చరిత్రలో నిలిచిపోయే తీర్పులు ఇచ్చాయి.
ఏడాది చివరలో సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్, దాణా కుంభకోణం కేసుల్లోనూ కోర్టులు సంచలన తీర్పులు ఇవ్వడం గమనార్హం.
View at DailyMotion
[…] Source: https://plentyus.com/todays-top-trending-news/ […]